లార్డ్స్ టెస్టు: రెండో ఇన్నింగ్స్ లో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్

15-08-2021 Sun 18:56
  • లార్డ్స్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • స్వల్ప స్కోరుకే అవుటైన రాహుల్
  • రోహిత్ (21), కోహ్లీ (20) కూడా అవుట్
  • మార్క్ ఉడ్ కు 2 వికెట్లు
  • శామ్ కరన్ కు ఓ వికెట్
India lost three wickets in second innings
లార్డ్స్ టెస్టులో ప్రస్తుతం భారత జట్టు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. రెండో ఇన్నింగ్స్ లో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 5, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 21, కెప్టెన్ విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసి అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ కు రెండు వికెట్లు లభించగా, శామ్ కరన్ ఓ వికెట్ తీశాడు. ప్రస్తుతం భారత్ 33 ఓవర్ల అనంతరం 3 వికెట్లకు 64 పరుగులు చేసింది. క్రీజులో ఛటేశ్వర్ పుజారా (8 బ్యాటింగ్), అజింక్యా రహానే (4 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ పై భారత్ ఆధిక్యం 37 పరుగులకు చేరింది.

ఈ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు చేసి 27 పరుగులు ఆధిక్యం పొందింది. ఆటకు రేపు ఆఖరి రోజు. దాంతో భారత్ కనీసం 200 పైచిలుకు లక్ష్యం నిర్దేశిస్తేనే ఈ మ్యాచ్ లో సురక్షితమైన స్థితిలో ఉంటుంది. ఒకవేళ సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచితే దాన్ని కాపాడుకోవడానికి టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.