మోదీ గడ్డం పెంచుకున్నంత మాత్రాన రవీంద్రనాథ్ ఠాగూర్ అయిపోరు: సీపీఐ నారాయణ వ్యంగ్యం

  • ప్రధానిపై ధ్వజమెత్తిన నారాయణ
  • ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని మండిపాటు
  • అంబానీ, అదానీలు కోట్లు సంపాదించుకున్నారని వ్యాఖ్యలు
CPI Narayana take a dig at PM Modi

ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ అగ్రనేత నారాయణ ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో సైతం అదానీ, అంబానీలు వందల కోట్లు సంపాదించుకున్నారని నారాయణ వెల్లడించారు. పేదలు మాత్రం తినడానికి తిండి కూడా దొరక్క పస్తులతో మలమల మాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ గడ్డం పెంచుకున్నంత మాత్రాన రవీంద్రనాథ్ ఠాగూర్ అయిపోరని విమర్శించారు.

More Telugu News