ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా రోజువారీ కేసుల సంఖ్య

15-08-2021 Sun 16:37
  • గత 24 గంటల్లో 65,500 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 319 కేసులు
  • కర్నూలు జిల్లాలో 15 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 16 మరణాలు
  • ఇంకా 17,865 మందికి చికిత్స
Corona surge declines in AP gradually

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 65,500 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 319 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 217, నెల్లూరు జిల్లాలో 181, పశ్చిమ గోదావరిలో 170, గుంటూరు జిల్లాలో 162, ప్రకాశం జిల్లాలో 102 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 15 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,835 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,647కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 19,93,697 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,62,185 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,865 మంది చికిత్స పొందుతున్నారు.