లార్డ్స్ టెస్టులో నాలుగో రోజు ఆట షురూ... కేఎల్ రాహుల్ అవుట్

15-08-2021 Sun 16:27
  • లార్డ్స్ లో భారత్, ఇంగ్లండ్ టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 391 ఆలౌట్
  • భారత్ పై 27 పరుగుల ఆధిక్యం
  • రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్
Mark Wood gets KL Rahul wicket on day four at Lords
లార్ట్స్ టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ షురూ చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికి ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రాహుల్ ఈసారి విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు చేసి మార్క్ ఉడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (15 బ్యాటింగ్), పుజారా క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 391 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 364 పరుగులు కాగా, ఇంగ్లండ్ కు 27 పరుగుల ఆధిక్యం లభించింది.