ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా 'భీమ్లా నాయ‌క్' ఫ‌స్ట్ గ్లింప్స్‌పై విమ‌ర్శ‌లు.. స‌మాధాన‌మిచ్చిన నిర్మాత‌

15-08-2021 Sun 12:48
  • ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్ లో సినిమా
  • ఫ‌స్ట్ గ్లింప్స్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూపించిన సినీ బృందం
  • రానాను మాత్రం చూపించ‌కపోవ‌డంతో విమ‌ర్శ‌లు
  • వెయిట్ చేయాల‌ని నిర్మాత నాగ వంశీ రిప్లై
naga vamsi gives reply on criticism
ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటోన్న ‘భీమ్లా నాయక్‌’ సినిమా నుంచి ఈ రోజు ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూపించారు కానీ, రానాను మాత్రం చూపించ‌లేదు. రానా వాయిస్ మాత్రం వినిపించారు.  

‘డ్యాని.. డ్యానియల్‌ శేఖర్‌’ అని ఇందులో రానా అంటాడు. రానాను ఈ వీడియోలో చూప‌క‌పోవ‌డంతో కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి ఒక్క‌రి వీడియోను మాత్ర‌మే విడుద‌ల చేయ‌డ‌మేంటని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌ల్టీ స్టారర్ మూవీ సోలో హీరో మూవీగా మారిందా? అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో నిర్మాత నాగ వంశీ రిప్లై ఇచ్చారు. ద‌య చేయి వెయిట్ చేయాల‌ని, దీనిపై ఎలాంటి ఊహాగానాలూ వ‌ద్ద‌ని చెప్పారు. ప్ర‌తీది క్ర‌మ ప‌ద్ధ‌తిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని తెలిపారు. కాగా, ఈ సినిమాలో నిత్యామేనన్‌, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.