దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

15-08-2021 Sun 07:59
  • మహాత్మగాంధీ సమాధి వద్ద మోదీ నివాళులు
  • ఎర్రకోట వద్ద స్వాగతం పలికిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  • త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం
Prime Minister Narendra Modi hoists the National Flag
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. తొలుత రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన మోదీ అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.