Nara Lokesh: మహిళా సంరక్షకులకు ఇదేం శిక్ష?: నారా లోకేశ్

  • కానిస్టేబుళ్లుగా మహిళా సంరక్షకులు?
  • ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమన్న లోకేశ్
  • వారికి పోలీసు విధులు వద్దని స్పష్టీకరణ
  • జీవో నెం.59 రద్దు చేయాలని డిమాండ్
Nara Lokesh questions govt

రాష్ట్రంలో మహిళా సంరక్షకులను కానిస్టేబుళ్లుగా మార్చుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా ఖాకీ దుస్తులు వేసుకునేందుకు ఒక్కరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమం అంటూ జాబ్ చార్ట్ లో పేర్కొని, ఇప్పుడు పోలీసు విధులు కేటాయిస్తారా? తుగ్లక్ నిర్ణయాలతో మహిళా సంరక్షకుల జీవితాలతో ఆడుకోవద్దు అని హితవు పలికారు.

"గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షకులుగా పనిచేస్తున్న వేలాది మంది తమకు పోలీసు విధులు వద్దని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ ను గౌరవిస్తూ, జాబ్ చార్ట్ కు విరుద్ధంగా పోలీసు విధులు కేటాయించరాదు. వారిని మహిళా శిశు సంక్షేమ శాఖలో అంతర్భాగం చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి విరుద్ధంగా తెచ్చిన జీవో నెం.59 రద్దు చేయాలి" అని లోకేశ్ డిమాండ్ చేశారు.

More Telugu News