టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఖరారు.. చిరంజీవికి మంత్రి పేర్ని నాని ఫోన్!

14-08-2021 Sat 20:18
  • గతంలోనూ ఓసారి ఏపీ సీఎంతో సమావేశం
  • తొలగని థియేటర్లు, టికెట్ సమస్యలు
  • సీఎంతో మాట్లాడాలని సూచన
  • ఆగస్టు చివరి వారంలో భేటీ
CM Jagan appointment finalized for Tollywood reps
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో సినిమా థియేటర్లు, టికెట్ రేట్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కరోనా రాకతో థియేటర్ల యాజమాన్యాల కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం జగన్ ను ఇంతకుముందోసారి కలిశారు. తాజాగా, మరోసారి సమావేశం అయ్యేందుకు సీఎం జగన్ అంగీకరించారు.

థియేటర్లు, టికెట్లు, ఇతర అంశాలపై సీఎంతో మాట్లాడాల్సిందిగా ఏపీ మంత్రి పేర్ని నాని అగ్రహీరో చిరంజీవికి ఈ రోజు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కాగా ఈ సమావేశం ఆగస్టు చివరివారంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఏపీలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు.