Pavan Kalyan: పవన్ సినిమా నుంచి రానున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

Pavan and Rana combo movie update
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ 'భీమ్లా నాయక్' పేరుతో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ రానున్నట్టుగా చెబుతున్నారు. దాంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది.

అయితే రేపు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను వదులుతారా? లేదంటే మేకింగ్ వీడియో ఏదైనా రిలీజ్ చేస్తారా? అనేది అందరిలో ఉత్కంఠను పెంచుతోంది. ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను రానా పోషిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. మాటలు అందించడం వలన సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Pavan Kalyan
Rana
Nithya Menen

More Telugu News