'మళ్లీ మొదలైంది' నుంచి మరో పోస్టర్!

14-08-2021 Sat 18:56
  • సుమంత్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • విడాకుల చుట్టూ తిరిగే కథ 
  • కథానాయికగా నైనా గంగూలీ పరిచయం 
  • కీలకమైన పాత్రలో సుహాసిని
Malli Modalaindi Sumanth poster released
మొదటి నుంచి కూడా సుమంత్ నిదానమే ప్రధానం అన్నట్టుగా ఒకదాని తరువాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మళ్లీ మొదలైంది' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా నైనా గంగూలి కథానాయికగా అలరించనుంది.

ఈ సినిమాతో కీర్తి కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఇది లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ .. ఎక్కడా బోర్ అనిపించకుండా సరదాగా సాగిపోతుందని చెబుతున్నారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ వస్తున్నారు.

అలా తాజాగా సుమంత్ పాత్రను .. ఆ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. విడాకులు తీసుకున్న మోస్ట్ కంఫ్యూజ్డ్ పర్సన్ అనీ .. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడే ఆయన, వంటబాగా చేస్తాడని పోస్టర్ ద్వారా చెప్పారు. ఈ సినిమాలో సుహాసిని .. వెన్నెల కిషోర్ .. పోసాని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.