బిగ్ బాస్ సీజన్-5 వచ్చేస్తోంది: నాగార్జున

14-08-2021 Sat 18:33
  • త్వరలో బిగ్ బాస్ కొత్త సీజన్
  • పక్కా ఎంటర్టయిన్ మెంట్ అంటూ నాగ్ వెల్లడి
  • విసుగు నుంచి విముక్తి అంటూ స్లోగన్
  • గతేడాది కరోనా సమయంలోనూ బిగ్ బాస్-4
Bigg Boss season five will be aired soon
గతేడాది కరోనా సంక్షోభం సమయంలోనూ బిగ్ బాస్-4 రియాలిటీ షోను నిర్వహించిన స్టార్ మా చానల్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విశేషంగా అలరించింది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్-5తో స్టార్ మా చానల్ మరోసారి సందడి చేయనుంది. బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభంపై హోస్ట్ నాగార్జున ఓ ప్రకటనలో వెల్లడించారు. బోర్ కొడుతోందన్న మాటే ఇక వినిపించదని, పక్కా ఎంటర్టయిన్ మెంట్ అందించేందుకు బిగ్ బాస్-5 వచ్చేస్తోందని నాగ్ తెలిపారు. విసుగు నుంచి విముక్తి అని పేర్కొన్నారు. ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓ సరదా వీడియో రూపొందించారు.