లార్డ్స్ టెస్టు: 200 దాటిన ఇంగ్లండ్ స్కోరు

14-08-2021 Sat 18:16
  • భారత్ తొలి ఇన్నింగ్స్ లో 364 ఆలౌట్
  • మూడో రోజు ఆటలో నిలకడగా ఇంగ్లండ్
  • లంచ్ వేళకు 3 వికెట్లకు 216 రన్స్
  • ఆదుకున్న రూట్, బెయిర్ స్టో
England first innings score crosses two hundred mark
లార్డ్స్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు దీటుగా స్పందిస్తోంది. భారత్ 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు మూడోరోజు ఆట లంచ్ వేళకు 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 89 పరుగులతోనూ, జానీ బెయిర్ స్టో 51 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ జట్టు ఇంకా 148 పరుగులు వెనుకబడి ఉంది. ఇవాళ్టి ఆటలో లంచ్ వరకు వికెట్ పడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.