విజయ్ 'బీస్ట్'కి ఓటీటీ నుంచి భారీ ఆఫర్!

14-08-2021 Sat 18:08
  • షూటింగు దశలో 'బీస్ట్'
  • యాక్షన్ ప్రధానంగా సాగే కథ
  • విజయ్ జోడీగా పూజ హెగ్డే 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్  
Beast movie upddate
తమిళనాట విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుసగా సంచలన విజయాలను నమోదు చేస్తూ ఆయన దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'బీస్ట్' రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా ఆయనకి అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ .. గతంలో విజయ్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కథలు చాలానే చేశాడు. కానీ ఆ యాక్షన్ చుట్టూ ఈ సారి ఉన్న ఆశయం వేరు .. ఆవేశం వేరు అని చెబుతున్నారు. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను పొందడానికి ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీపడ్డాయట.

అయితే అందరికంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేసి, స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు పొందినట్టుగా ప్రచారం  జరుగుతోంది. అందుకు సంబంధించిన లావాదేవీలు పూర్తయినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, విజయ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది.