కేసీఆర్ అంటేనే పెద్ద ఫేక్: గీతారెడ్డి

14-08-2021 Sat 17:51
  • మోదీ ఫేక్ అయితే కేసీఆర్ ఇంకా పెద్ద ఫేక్
  • రాష్ట్రంలో మైనార్టీలకు 45 లక్షలకు పైగా ఓటు బ్యాంక్ ఉంది
  • అందరూ కలిసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి
KCR is a big fake says Geetha Reddy
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లపై కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి గీతారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఫేక్ అయితే కేసీఆర్ ఇంకా పెద్ద ఫేక్ అని అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మైనార్టీ గర్జన సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో రోజుల తర్వాత ఇంత పెద్ద మైనార్టీ సభను చూస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీలకు 45 లక్షలకు పైగా ఓటు బ్యాంక్ ఉందని... అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనార్టీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లే ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయని.. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.