దసరా బరిలో ఆచార్య .. అఖండ!

14-08-2021 Sat 17:33
  • 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీ మారే ఛాన్స్ ?
  • జనవరికి వాయిదా పడుతుందంటూ టాక్
  • అక్టోబర్ 8వ తేదీన 'అఖండ' రిలీజ్
  • ఆ తరువాత వారంలో 'ఆచార్య' విడుదలంటూ ప్రచారం  
New release dates for Aacharya and Akhanda
చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' రూపొందింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టు పూర్తిచేసుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో చిరూ సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది.

దసరా .. దీపావళి .. సంక్రాంతికి విడుదల తేదీలను కొన్ని సినిమాలు ఫిక్స్ చేసుకోవడంతో, 'ఆచార్య' విడుదల ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఇక బాలకృష్ణ హీరోగా చేస్తున్న 'అఖండ' పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఉంది. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే షూటింగును పూర్తిచేసుకోనుంది. కానీ సంక్రాంతి వరకూ ఎక్కడా ఖాళీ లేకపోవడంతో, ఎప్పుడు ఈ సినిమాను వదులుతారోననేది అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న.

అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల కాకపోవచ్చనే టాక్ కొన్ని రోజులుగా బలంగానే వినిపిస్తోంది. ఈ సినిమా జనవరి 8వ తేదీన గానీ .. 20వ తేదీన గాని విడుదల కావొచ్చని అంటున్నారు. అందువలన అక్టోబర్ 8 వ తేదీన 'అఖండ'ను ... అక్టోబర్ 13వ తేదీన 'ఆచార్య'ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.