ప్రముఖ హీరో నిర్మిస్తున్న సినిమాలో కీర్తి సురేశ్!

14-08-2021 Sat 17:12
  • హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో కీర్తి సురేశ్ 
  • పలు భాషల చిత్రాలలో అవకాశాలు  
  • హీరో సూర్య బ్యానర్లో తాజాగా ఛాన్స్
  • అధర్వ హీరో.. బాల దర్శకత్వం  
Keerti Suresh to act in Suryas banner
 ప్రస్తుతం మన కథానాయికలలో కీర్తి సురేశ్ కి టాలెంటెడ్ హీరోయిన్ గా పేరుంది. ఎలాంటి పాత్రనైనా ప్రతిభావంతంగా పోషిస్తుంది. అలాగే హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ కూడా వున్న నటి తను. అందుకే, ఆమెకు తగ్గా పాత్రలు ఏ భాషలో వున్నా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఆ విధంగా ప్రస్తుతం తెలుగులో మహేశ్ తో 'సర్కారు వారిపాట' సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తమిళ, మలయాళ భాషలలో కూడా పలు సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా తమిళంలో ఆమెకు మొదటి నుంచీ మంచి డిమాండ్ వుంది. ఇప్పటికే రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ క్రమంలో కీర్తి సురేశ్ కి తాజాగా తమిళంలో మరో అవకాశం వచ్చింది. హీరో సూర్య సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రంలో కీర్తిని కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే, ఇందులో సూర్య నటించడం లేదట. ఆమధ్య తెలుగులో 'గద్దలకొండ గణేశ్' సినిమాలో నటించిన తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తాడు. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు బాల దీనికి దర్శకత్వం వహిస్తాడు.