ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్

14-08-2021 Sat 16:16
  • పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటన
  • భీమవరంలో పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
  • సీఎం రాకతో భారీ బందోబస్తు
CM Jagan attends MLA Puppala Vasubabu daughter wedding in Bhimavaram
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహం నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. ఈ వివాహానికి సీఎం జగన్ విచ్చేశారు. నూతన వధూవరులు స్నిగ్ధ, హనీష్ లను ఆశీర్వదించారు. ఈ వివాహం ఇక్కడి కె-కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఇక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ అక్కడినుంచి రోడ్డుమార్గంలో కల్యాణమండపానికి చేరుకున్నారు. సీఎంకు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇవాళ భీమవరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.