ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ధోనీ సేన

14-08-2021 Sat 14:35
  • భారత్ లో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-14
  • సెప్టెంబరు 19 నుంచి పార్ట్-2
  • యూఏఈ వేదికగా మ్యాచ్ లు
  • సన్నద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్
Chennai Super Kings team arrives Dubai for IPL
మరి కొన్ని వారాల్లో ఐపీఎల్ సందడి షురూ కానుంది. కరోనా వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్-14వ సీజన్ ను పూర్తి చేసేందుకు బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని ఎంచుకోవడం తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ పార్ట్-2 యూఏఈ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ బృందం దుబాయ్ చేరుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర ఆటగాళ్లు తమ కుటుంబాలతో సహా దుబాయ్ గడ్డపై అడుగుపెట్టారు.

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లకు మరో నెల రోజుల సమయం ఉండడంతో ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తోంది. అందుకే, కాస్త ముందుగానే ఆటగాళ్లను తరలించింది. ఈ మేరకు చెన్నై ఫ్రాంచైజీ అంటూ ఓ వీడియోను పంచుకుంది.