డీకే శివకుమార్ తో భేటీ అయిన మధు యాష్కి

14-08-2021 Sat 14:17
  • బెంగళూరులోని శివకుమార్ నివాసంలో భేటీ
  • మర్యాదపూర్వకంగానే కలిశానన్న మధు యాష్కి
  • రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు యత్నిస్తున్నామని వ్యాఖ్య
Madhu Yashki meets DK Shivakumar
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో ఏఐసీసీ పరిశీలకుడు, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కి భేటీ అయ్యారు. బెంగళూరు సదాశివనగర్ లోని శివకుమార్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాజకీయాలతో పాటు పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

అనంతరం మీడియాతో మధు యాష్కీ మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే డీకేను కలిశానని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు.