Pakistan: సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు

  • ఈరోజు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం
  • అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద స్వీట్లు పంచుకున్న జవాన్లు
  • రేపు కూడా స్వీట్లు ఇస్తామన్న బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్
India and Pakistan soldiers shares sweets

భారత్-పాకిస్థాన్ సరిహద్దులెప్పుడూ చాలా ఉద్రిక్తంగా ఉంటాయి. ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో తుపాకుల కాల్పులు, మోర్టార్ల ప్రయోగాలతో సరిహద్దులు దద్దరిల్లుతుంటాయి. అయితే, ఈరోజు సరిహద్దుల వద్ద ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రోజు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం కావడమే దీనికి కారణం.

పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ మాట్లాడుతూ, రేపు మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా వారికి స్వీట్లు బహుమతిగా ఇస్తామని చెప్పారు. 1947 ఆగస్ట్ 14న అఖండ భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. దీంతో, వారు మన కంటే ఒక్కరోజు ముందుగానే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.

More Telugu News