'రాధే శ్యామ్' టీమ్ అలా ప్లాన్ చేసిందట!

14-08-2021 Sat 12:02
  • విదేశీ నేపథ్యంలో సాగే కథ
  • పునర్జన్మలతో ముడిపడిన కథ
  • వచ్చేనెల నుంచి ప్రమోషన్లు
  • జనవరి 14వ తేదీన భారీ రిలీజ్
Radhe Shyam movie update
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో అధిక భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరించారు. అందుకు తగినట్టుగా కాస్ట్యూమ్స్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు.

ఈ సినిమా విడుదలపై రోజుకో ప్రచారం జరుగుతూ ఉండటంతో, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే అప్పటివరకూ ఈ సినిమాను గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తూనే ఉండాలి. అలా ప్రమోషన్స్ పరంగా ఈ సినిమా టీమ్ ప్లాన్ చేసిందని అంటున్నారు.

ఆ ప్లానింగ్ ప్రకారం వచ్చే నెల నుంచే కొత్త పోస్టర్లు వదలడం మొదలు పెడతారట. ఆ తరువాత .. టీజర్లు .. ట్రైలర్లు .. మేకింగ్ వీడియోలు .. పండుగ సందర్భంగా స్పెషల్ వీడియోలు అందిస్తూ వెళతారు. ఫస్టు సింగిల్ ను మాత్రం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కృష్ణంరాజు .. భాగ్యశ్రీ కీలకమైన పాత్రలను చేసిన సంగతి తెలిసిందే.