శ్రీకాకుళం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

14-08-2021 Sat 08:33
  • తెల్లవారుజామున చేపల వేటకు మత్స్యకారులు
  • కాసేపటికే ముగ్గురి గల్లంతు
  • కొనసాగుతున్న గాలింపు చర్యలు
three fishermen went missing while going to sea
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ తెల్లవారుజామున గారకు చెందిన పలువురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అనంతరం వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గణేశ్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. విషయం తెలిసిన బాధిత కుటుంబాలు సముద్రం ఒడ్డుకు చేరుకున్నాయి. వారి రోదనలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది.