సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-08-2021 Sat 07:38
  • 'సాకీ' దుస్తుల్లో సమంత పోజు వైరల్ 
  • పవన్, హరీశ్ సినిమా అప్ డేట్ 
  • వైష్ణవ్ తేజ్ సరసన మరో భామ 
Samanthas photograph gets record level likes
*  అందాలతార సమంత తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఆమె ఫోటో వైరల్ అవుతోంది. తన సొంత బ్రాండ్ 'సాకీ' దుస్తులు ధరించి, కారులో కూర్చొని తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ, మై సాకీ వరల్డ్ అంటూ పేర్కొంది. దీంతో ఈ ఫొటో మొదటి మూడు గంటల్లోనే పది లక్షలకు పైగా లైక్స్ పొంది రికార్డు కొట్టింది.
*  పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను పవన్ జన్మదినమైన సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
*  'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని గిరీశయ్య దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా, ఒక హీరోయిన్ గా ఇప్పటికే కేతిక శర్మను ప్రకటించారు. మరో కథానాయికగా శోభితా రానాను తాజాగా ఎంపిక చేశారు.