అమరరాజా నూతన చైర్మన్‌గా రేపు బాధ్యతలు స్వీకరించనున్న గల్లా జయదేవ్

14-08-2021 Sat 07:36
  • అమరరాజా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన గల్లా రామచంద్రనాయుడు
  • అవరోధాలను అధిగమించడమే నాయకత్వ లక్షణమన్న నాయుడు
  • న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడబోనని స్పష్టీకరణ
Galla Jayadev is the new chairman of Amara raja group
అమరరాజా బ్యాటరీస్ నూతన చైర్మన్‌గా గల్లా జయదేవ్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ అధినేత గల్లా రామచంద్రనాయుడు ప్రకటించారు. తిరుపతి సమీపంలోని కరకంబాడిలో ఉన్న పరిశ్రమ ఆవరణలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. అలాగే, గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.

అవరోధాలను అధిగమించడమే నాయకత్వ లక్షణమన్న ఆయన.. చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు తెలిపారు. పరిశ్రమ విషయంలో కొన్ని అంశాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయని, కాబట్టి వాటి గురించి మాట్లాడబోనని చెప్పారు. అమరరాజా చైర్మన్‌గా రేపు బాధ్యతలు స్వీకరించనున్న గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. పరిస్థితులను బట్టి ఏం జరగాలన్నది కాలమే నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.