తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

13-08-2021 Fri 21:17
  • గత 24 గంటల్లో 87,509 కరోనా టెస్టులు
  • 427 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 7,812 మందికి చికిత్స
Telangana covid cases daily reportq
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించగా, 427 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 43, వరంగల్ అర్బన్ జిల్లాలో 41 కేసులు గుర్తించారు. నిర్మల్ జిల్లాలో ఒక్క తాజా కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 609 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 6,51,715 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,40,065 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,812 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,838కి పెరిగింది.