ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బకొట్టిన సిరాజ్

13-08-2021 Fri 21:03
  • లార్డ్స్ టెస్టులో సిరాజ్ విజృంభణ
  • వరుస బంతుల్లో సిబ్లే, హమీద్ అవుట్
  • ఇంగ్లండ్ స్కోరు 2 వికెట్లకు 28 రన్స్
  • తొలి ఇన్నింగ్స్ లో 364 రన్స్ చేసిన భారత్
Siraj scalps two early wickets in two balls
లార్డ్స్ టెస్టులో టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం ద్వారా సిరాజ్ ఆత్మరక్షణలోకి నెట్టాడు. సిరాజ్ ధాటికి ఓపెనర్ డొమినిక్ సిబ్లే (11), వన్ డౌన్ బ్యాట్స్ మన్ హసీబ్ హమీద్ (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ప్రస్తుతం ఇంగ్లండ్ 2 వికెట్లకు 28 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆతిథ్య జట్టు ఇంకా 336 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో ఓపెనర్ రోరీ బర్న్స్ (11 బ్యాటింగ్), కెప్టెన్ జో రూట్ (5 బ్యాటింగ్) ఉన్నారు.