ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

13-08-2021 Fri 19:53
  • ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం
  • ఉగ్రవాదుల కుట్రపై నిఘా వర్గాల హెచ్చరిక
  • అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు
  • నలుగురి అరెస్ట్.. 55 తుపాకుల స్వాధీనం
Delhi police busted huge conspiracy
స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 55 తుపాకులు, 50 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్ లు ఉన్నాయి. ఈ నలుగురు ఆయుధాల అక్రమ రవాణా ముఠా సభ్యులుగా భావిస్తున్నారు.

అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. డ్రోన్లు, బెలూన్లపై నిషేధం విధించారు.