వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం

13-08-2021 Fri 18:42
  • కేంద్రం పర్యావరణ పరిరక్షణ చర్యలు
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కీలక నిర్ణయం
  • తయారీ, విక్రయం, వాడకంపై నిషేధం
  • పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
Union govt bans single use plastic from next year
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది జులై 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీనిపై తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై ఈ నిషేధం వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకం అంశాలు నిషేధం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.