'రాజ రాజ చోర' నాన్ స్టాప్ గా నవ్విస్తాడు: మేఘ ఆకాశ్

13-08-2021 Fri 18:35
  • సరదాగా సాగిపోయే కథ
  • సంజన పాత్రలో కనిపిస్తాను
  • ప్రతిపాత్రలో ఫన్ ఉంటుంది
  • తప్పకుండా హిట్ కొడుతుంది    
Megha Akash says about Raja Raja Chora movie
శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి 'రాజ రాజ చోర' సినిమాను రూపొందించాడు. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, వివేక్ సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు దొంగగా నటించగా, ఆయన సరసన నాయికలుగా మేఘ ఆకాశ్ .. సునైన అలరించనున్నారు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా మేఘ ఆకాశ్ మాట్లాడుతూ .. "ఈ కథ వినగానే నాకు నచ్చేసింది .. పాత్రలన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నేను చేసిన 'సంజన' పాత్రతో పాటు అన్ని పాత్రలు కామెడీ టచ్ తో సాగుతాయి. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి ఇది పూర్తి భిన్నంగా అనిపిస్తుంది. ఈ పాత్ర నాకు మరింత మంచి పేరు తెస్తుంది.

శ్రీవిష్ణు చాలా తక్కువగా మాట్లాడతారు .. కానీ కామెడీ సీన్స్ ను చాలా బాగా చేస్తారు. మా కాంబినేషన్లో టెంపుల్లో వచ్చే సీన్ నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. ఆయనతో కలిసి నటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా తప్పుకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చింది.