Vishwak Sen: కొంతమందికి 'పాగల్' చూపించాను .. నా పేరు మార్చుకోనవసరం లేదన్నారు: విష్వక్సేన్

Vishwak Sen is very confident on his movie
  • థియేటర్లో చూస్తే కలిగే ఫీల్ వేరు
  • ఫస్టాఫ్ అంతా నవ్వులే ఉంటాయి
  • సెకండాఫ్ లో కన్నీళ్లు పెట్టనివాళ్లుండరు
  • ఇంటికి వెళ్లాక కూడా సినిమా గురించే మాట్లాడుకుంటారు
విష్వక్సేన్ కథానాయకుడిగా బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో, నరేశ్ కుప్పిలి 'పాగల్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో విష్వక్సేన్ మాట్లాడాడు.  

"ప్రతి ఒక్కరి ప్రేమ కోసం 'పాగల్' ఎందుకు పరితపిస్తూ ఉంటాడనే ఒక ఎమోషనల్ ఎపిసోడ్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడుతూ .. 'మూసుకుపోయిన థియేటర్లన్నీ ఈ సినిమాతో తెరిపిస్తా, లేదంటే నా పేరు మార్చుకుంటాను' అన్నాను. ఆ తరువాత కొంతమంది దర్శకులకు .. వారి సన్నిహితులకు ఈ సినిమాను చూపించాను. వాళ్లంతా కూడా నువ్వు పేరు మార్చుకోవలసిన అవసరం రాదు .. సినిమా అంత బాగా వచ్చిందని గట్టిగా చెప్పారు.

ఈ సినిమాను థియేటర్లలో చూస్తే కలిగే ఫీల్ వేరు. అందువల్లనే అందుకోసం చాలా కష్టపడ్డాను. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా నవ్వుకోకుండా .. సెకండాఫ్ అంతా ఎమోషనల్ కాకుండా ఉండలేరు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా అంతా మాట్లాడుకునే సినిమా అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.
Vishwak Sen
Nivetha Peturaj
Simran
Megha lekha

More Telugu News