తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద ముందుకొచ్చిన సముద్రం... వీడియో ఇదిగో!

13-08-2021 Fri 16:44
  • పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు
  • రెండు దుకాణాలు ధ్వంసం
  • స్థానిక భవనాలను తాకుతున్న కెరటాలు
  • పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే రాపాక
High tides at Antarvedi beach in East Godavari district
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో తీరంలోని రెండు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ముందుకు చొచ్చుకువచ్చిన సముద్రపు కెరటాలు స్థానిక భవనాలను తాకుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా అంతర్వేది వద్ద అలలు ముందుకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, అలల తాకిడికి తీరంలోని సరుగుడు తోటలు కోతకు గురై నీరు పల్లపు ప్రాంతాలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అంతర్వేది వచ్చి అలల తీరును పరిశీలించారు.