క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన నీతి ఆయోగ్ బృందం

13-08-2021 Fri 15:46
  • ఏపీకి విచ్చేసిన నీతి ఆయోగ్ బృందం
  • సీఎంతో మర్యాదపూర్వక భేటీ
  • ఎస్డీజీ ఇండెక్స్ నివేదిక అందజేత
  • ఏపీ అభివృద్ధి వివరాలు తెలిపిన సీఎం జగన్
NITI Aayog team met CM Jagan at Tadepally camp office
నీతి ఆయోగ్ బృందం ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఆ బృందంలోని సభ్యులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్డీజీ ఇండెక్స్ 2020-21 నివేదికను వారు ఏపీ సీఎంకు అందజేశారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ స్పందిస్తూ, ఏపీ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతి ఆయోగ్ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు సంయుక్త సమద్దార్, నీతి ఆయోగ్ ఎస్డీజీ అధికారి అలెన్ జాన్, నీతి ఆయోగ్ డేటా అనలిస్ట్ సౌరవ్ దాస్ పాల్గొన్నారు.