Azharuddin: అజార్ మ్యాచ్ ఫిక్సింగ్ పై సీబీఐ చేత విచారణ చేయించాలి: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి

  • అజార్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్లీ తెరవాలి
  • బీసీసీఐ ఆదేశాలను అజార్ పాటించడం లేదు
  • హెచ్సీఏలో అజార్ చేసిన అక్రమాలను బయటపెట్టాలి
CBI enauiry has to be done on Azharuddin match fixing cases

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్లీ తెరవాలని... సీబీఐ చేత విచారణ జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి డిమాండ్ చేశారు. హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు, ఫేస్ బుక్ లో ఆరోపణలు చేసినందుకు తమపై అజార్ రూ. 2 కోట్లకు పరువునష్టం దావా వేశారని చెప్పారు.

ఈ దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టులకు ఈరోజు గురువారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అజార్ వేసిన పరువునష్టం దావాపై తాము కౌంటర్ వేశామని... అయితే ఇప్పటి వరకు ఆయన నుంచి సమాధానం రాలేదని గురువారెడ్డి అన్నారు. బీసీసీఐ ఆదేశాలను అజార్ పాటించడం లేదని చెప్పారు. హెచ్సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

More Telugu News