అందులో నేనూ ఒకడిని.. కోహ్లీదే ఆ క్రెడిట్​: రవీంద్ర జడేజా

13-08-2021 Fri 13:59
  • ఫిట్ నెస్ తోనే బెస్ట్ ఆల్ రౌండర్ గా ఉన్నా
  • ఫిట్ నెస్ ను కోహ్లీ బాగా నమ్ముతాడు
  • అందరిలోనూ అదే ఉత్సాహం నింపుతాడు
Jaddu Says Kohli Helped Him Alot In Fitness
మెరుపు లాంటి అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు, బ్యాటింగ్ జోరు, బౌలింగ్ తీరు.. ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. దానికంతటికీ కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీనే అంటున్నాడు ఈ ఆల్ రౌండర్. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్ గా ఎదగడానికి కోహ్లీనే కారణమని చెప్పాడు.

‘‘అవును, ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. అయితే, అది ఊరికే రాలేదు. దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. భుజాల వ్యాయామం, రన్నింగ్ వంటివి చేశాను. దాని వల్లే మైదానంలో నేను చురుగ్గా ఉండగలుగుతున్నాను. మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయగలుగుతున్నాను. ఆ క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీదే’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

ఫిట్ నెస్ ప్రమాణాలను మెరుగుపరచుకోవడంలో కోహ్లీ ఎంతో సాయం చేశాడన్నారు. 'విరాట్ కచ్చితంగా ఉత్సాహపరుడు, ఫిట్ గా ఉంటాడు' అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. ఫిట్ నెస్ ను అతడు బాగా నమ్ముతాడని, అందరిలోనూ అదే ఉత్సాహాన్ని నింపుతాడని చెప్పాడు.