విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే వదిలిపెడుతూ సీబీఐ మెమో దాఖలు
- విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకోవాలన్న సీబీఐ
- కౌంటర్ దాఖలకు గడువు కావాలన్న విజయసాయి
- తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా
బెయిల్ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే వదిలిపెడుతున్నట్లు సీబీఐ మెమో దాఖలు చేసింది. కోర్టు విచక్షణాధికారాల మేరకు ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరింది. అయితే, సీబీఐ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. దీంతో పిటిషన్‌పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.