అల్లు అర్జున్ 'పుష్ప' నుంచి తొలి పాట 'దాక్కో దాక్కో మేక‌.. పులొచ్చి కొరుకుద్ది పీక' విడుద‌ల‌

13-08-2021 Fri 11:26
  • సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'పుష్ప‌'
  • సంగీతం దేవిశ్రీ.. సాహిత్యం చంద్రబోస్  
  • తొలి పార్టు క్రిస్మ‌స్ కు విడుద‌ల 
 pushpa first song releases
అల్లు అర్జున్ న‌టిస్తోన్న‌ 'పుష్ప' సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక‌.. పులొచ్చి కొరుకుద్ది పీక' పాట విడుద‌లైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాటను విడుద‌ల చేశారు. పాట సాహిత్యం, సంగీతం అమితంగా అల‌రిస్తుండ‌డంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో  ఈ సినిమా రూపుదిద్దుకుంటోన్న విష‌యం తెలిసిందే.  'అల.. వైకుంఠపురములో' వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా 'పుష్ప'పై భారీ అంచనా‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ లో అల్లు అర్జున్ క‌న‌ప‌డిన తీరు అల‌రించింది.

ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తొలి పార్టును క్రిస్మ‌స్ కు విడుద‌ల కానుందని ఈ సినిమా యూనిట్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ క‌థాంశంతో వ‌స్తోంది.