China: కరియోకి పాటలపై నిషేధం విధించిన చైనా

  • కరియోకి పాటలకు చైనాలో ఎంతో ఫాలోయింగ్
  • ముఖ్యంగా బార్లలో ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు
  • దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా పాటలు ఉన్నాయన్న చైనా ప్రభుత్వం
China bans Karaoke songs

ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో చైనా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. చైనా ప్రభుత్వం ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ప్రజలంతా దాన్ని తు.చ. తప్పకుండా పాటించాల్సిందే. ఎవరైనా వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

అలాగే, తాజాగా చైనా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరియోకి పాటలను నిషేధించింది. ఈ పాటలకు చైనాలో చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా బార్లలో వీటిని ఎక్కువగా పాడుతుంటారు. ఈ పాటల ఔట్ లెట్లు ఆ దేశంలో 50 వేలకు పైగానే ఉన్నాయి.

ఈ పాటలను నిషేధించడానికి గత కారణాలను కూడా చైనా ప్రభుత్వం వెల్లడించింది. చైనా జాతీయ ఐక్యత, సార్వభౌమత్వానికి హాని కలిగించేలా ఈ పాటలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. మాదకద్రవ్యాలను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొంది. మతపరమైన విధానాలను కూడా ఉల్లంఘించే విధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈ పాటలపై నిషేధం అమల్లోకి రానుంది.

More Telugu News