చిరూ 153వ సినిమా షూటింగ్ ప్రారంభం!

13-08-2021 Fri 10:56
  • 'ఆచార్య' షూటింగ్ పూర్తి
  • సెట్స్ పైకి 'లూసిఫెర్' రీమేక్
  • ఈ రోజే మొదలైన షూటింగ్
  • ఒక పాటను రికార్డు చేసిన తమన్    
Chiranjeevi new movie shooting started
చిరంజీవి మరో సినిమాను స్టార్ట్ చేశారు. 'ఆచార్య' సినిమా షూటింగును అలా పూర్తి చేశారో లేదో, ఇలా ఆయన 'లూసిఫర్' రీమేక్ ను మొదలుపెట్టేశారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఈ రోజు హైదరాబాద్ లో సురేశ్ సెల్వ రాజన్ వేసిన ప్రత్యేకమైన సెట్లో మొదలైంది.

కెరియర్ పరంగా చిరంజీవికి ఇది 153వ సినిమా. సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారితో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన ఒక పాటను రికార్డు చేయడం కూడా జరిగిపోయింది. ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు.

మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' భారీ విజయాన్ని నమోదు చేసింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఆయన కెరియర్లోనే చెప్పుకోదగ్గిన సినిమాగా నిలిచింది. అందువల్లనే చిరంజీవి ఈ కథ పట్ల మొగ్గుచూపుతూ వచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.