సస్పెన్స్ థ్రిల్లర్ టైటిల్ ను మార్చేశారట!

13-08-2021 Fri 10:31
  • తాప్సీ, విజయ్ సేతుపతి జంటగా సినిమా 
  • మొదట్లో 'అన్నాబెల్లె సుబ్రమణ్యం' అనే టైటిల్ 
  • తాజాగా 'అన్నాబెల్లె సేతుపతి'గా మార్పు  
  • హాట్ స్టార్ ద్వారా విడుదల  
Vijay Sethupathi movie title changed
కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్ల జోరు పెరిగింది. ఈ తరహా సినిమాలకు కంటెంట్ ప్రధానం .. అందువలన బడ్జెట్ తక్కువే అవుతుంది. హిట్ అయితే వచ్చే లాభాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందువలన ఆ తరహా సినిమాల తాకిడి ఎక్కువవుతోంది. ఇక ఇలాంటి కథలకి స్టార్ హీరోలు .. హీరోయిన్లు తోడైతే ఆ తీరే వేరుగా ఉంటుంది.

అలా విజయ్ సేతుపతి - తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడే 'అన్నాబెల్లె సుబ్రమణ్యం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ను మార్చారు. విజయ్ సేతుపతికి వివిధ భాషల్లో గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, 'అన్నాబెల్లె సేతుపతి' అని సెట్ చేశారట.

ఈ సినిమాలో అటు విజయ్ సేతుపతి .. ఇటు తాప్సీ ఇద్దరూ కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ సినిమాను 'డిస్నీ హాట్ స్టార్'లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పునర్జన్మలతో కూడిన ప్రేమకథే అయినప్పటికీ, హారర్ టచ్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందని అంటున్నారు.