సానుభూతి కోస‌మే ఈట‌ల అనేక ర‌కాల‌ నాట‌కాలాడుతున్నారు: బాల్క సుమ‌న్

13-08-2021 Fri 10:30
  • గెలుపు కోసం ఈటల రాజేంద‌ర్ ఎన్ని ఎత్తులు వేసినా మేమే గెలుస్తాం
  • కేసీఆర్ ప్ర‌భుత్వం కొన‌సాగిస్తోన్న అభివృద్ధి, సంక్షేమం ముందు అవి ప‌నికిరావు
  • హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
balka suman slams eetela
ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక కోసం త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న అంచ‌నాల‌తో ప్ర‌ధాన పార్టీల‌న్నీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఈటలపై విమర్శలు గుప్పించారు. సానుభూతి కోస‌మే ఈట‌ల అనేక ర‌కాల‌ నాట‌కాలాడుతున్నారని ఆరోపించారు. గెలుపు కోసం ఈటల రాజేంద‌ర్ ఎన్ని ఎత్తులు వేస్తున్న‌ప్ప‌టికీ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం కొన‌సాగిస్తోన్న అభివృద్ధి, సంక్షేమం ముందు అవి ప‌నికిరావ‌ని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ గెలుపు ఖాయ‌మైంద‌ని చెప్పుకొచ్చారు.