CBI: వివేకానందరెడ్డి హత్యకేసు: ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ సురేంద్రనాథ్‌రెడ్డిని విచారించిన సీబీఐ

CBI questions afu registrar surendranath reddy on viveka murder case
  • మృతదేహం రక్తపు మడుగులో ఉంటే సాధారణ మరణమా?
  • కంగారులో సరిగా గుర్తించలేకపోయానన్న సురేంద్రనాథ్‌రెడ్డి
  • చెప్పుల దుకాణం యజమాని బ్యాంకు ఖాతా పరిశీలన
  • సునీల్, దస్తగిరిని వివేకా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ ముమ్మరం చేసిన సీబీఐ నిన్న వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్‌రెడ్డిని ప్రశ్నించింది. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి వుంటే సాధారణ మరణమని ఎలా అనుకున్నారని అధికారులు ప్రశ్నించగా..  కంగారులో సరిగా గుర్తించలేకపోయినట్టు ఆయన బదులిచ్చినట్టు సమాచారం.

అలాగే, సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరిని కారులో ఎక్కించుకుని వివేకా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు అక్కడి ప్రాంతాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి మరోమారు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను కూడా ప్రశ్నించారు. మున్నా బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డి పొలం పనులు చూసుకునే జగదీశ్వర్‌రెడ్డి తమ్ముడు ఉమాశంకర్‌రెడ్డి, ఓ యూట్యూబ్ చానల్ విలేకరి, సునీల్ కుమార్ బంధువు భరత్ యాదవ్‌ను సీబీఐ అధికారులు విచారించారు.
CBI
Andhra Pradesh
YS Vivekananda Reddy
Murder Case

More Telugu News