సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

13-08-2021 Fri 07:23
  • 'శాకుంతలం' పూర్తి చేసిన సమంత 
  • చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్?
  • 'విక్రమ్' మొదలెడుతున్న కమల్  
Samantha completes her part for Shakuntalam movie
*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' చిత్రం షూటింగ్ హైదరాబాదులో గత కొంత కాలంగా జరుగుతోంది. ఇందులో శకుంతలగా నటిస్తున్న ప్రధాన పాత్రధారి సమంత తన షూటింగు పార్టును అప్పుడే పూర్తి చేసినట్టు చెబుతున్నారు. దీంతో 'థ్యాంక్యూ శకుంతల..' అంటూ ఆమెకు చిత్రం టీమ్ కృతజ్ఞతలతో కూడిన వీడ్కోలు పలికే ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
*  మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నట్టు తాజా సమాచారం.
*  కమలహాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగును ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2 వరకు చెన్నైలో నిర్వహిస్తారు. ఈ షెడ్యూలులో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.