లార్డ్స్ లో రోహిత్ శర్మ అర్ధసెంచరీ... టీమిండియా సెంచరీ

12-08-2021 Thu 19:42
  • టీమిండియా, ఇంగ్లండ్ రెండో టెస్టు
  • లార్డ్స్ వేదికగా మ్యాచ్
  • టాస్ నెగ్గిన ఇంగ్లండ్
  • టీమిండియాకు మొదట బ్యాటింగ్
Opener Rohit Sharma completes fifty in Lords
లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ సాధించగా, భారత్ స్కోరు వంద పరుగుల మార్కు దాటింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ టీమిండియా ఓపెనర్లు గొప్ప స్థైర్యం కనబరిచారు. ముఖ్యంగా రోహిత్, ఇంగ్లండ్ పేస్ విభాగాన్ని ఆచితూచి ఎదుర్కొంటూనే వీలు చిక్కినప్పుడలా బంతిని బౌండరీకి తరలించాడు.

ప్రస్తుతం టీమిండియా 37 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 81, కేఎల్ రాహుల్ 19 పరుగులతో ఆడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా వర్షం ఓసారి అంతరాయం కలిగించింది. అయితే కాసేపటికే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.