ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

12-08-2021 Thu 18:21
  • లొంగుబాట పట్టిన స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు
  • గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం
  • మీడియా ముందుకు మావోలు
  • మావోలు జనజీవనంలోకి రావాలన్న సవాంగ్
Six maoists surrendered to AP Police
ఆంధ్రా-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లొంగిపోయిన మావోలను మీడియా ముందుకు తీసుకువచ్చారు. మావో భావజాలానికి ఆదరణ తగ్గుతోందని, నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో ఏపీ పోలీసుల అవగాహన కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయని సవాంగ్ పేర్కొన్నారు. వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న  మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.