వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను మార్చుతూ జీవో జారీ

12-08-2021 Thu 18:08
  • హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్ల మార్పు
  • కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి
  • వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని వ్యాఖ్య
Warangal Urban and Rural districts names changed
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. హన్మకొండ జిల్లాలో హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి, వేలేరు, ధ‌ర్మ‌సాగ‌ర్‌, ఎల్క‌తుర్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, క‌మాలాపూర్‌, ప‌ర‌కాల‌, న‌డికూడ‌, దామెర‌, ఆత్మ‌కూరు, శాయంపేట‌ మండలాలు ఉన్నాయి.
 
వరంగల్ జిల్లాలో వ‌రంగ‌ల్‌, ఖిల్లా వ‌రంగ‌ల్‌, గీసుగొండ‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, రాయ‌ప‌ర్తి, ప‌ర్వ‌త‌గిరి, సంగెం, న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ‌ మండలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని చెప్పారు.