తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

12-08-2021 Thu 15:37
  • నూతనంగా క్యాజువాలిటీ వార్డు నిర్మాణం
  • ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ
  • ఈ కార్యక్రమానికి హాజరైన చెవిరెడ్డి, భూమన
YV Subba Reddy inaugurates oxygen plant in Tirupati SVIMS Hospital
టీటీడీ చైర్మన్ గా మరోసారి బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి నేడు తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. దాంతోపాటు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాజువాలిటీ వార్డును కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం వైవీ సుబ్బారెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆక్సిజన్ ప్లాంట్, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించారు.

కాగా, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , భూమన కరుణాకర్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. శిలాఫలకంపై కేవలం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరు మాత్రమే ఉందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోరా? అంటూ స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మపై భూమన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవలే ఏపీ సర్కారు స్విమ్స్ డైరెక్టర్ గా వెంగమ్మ పదవీకాలాన్ని మూడేళ్లకు పెంచింది.