'బీస్ట్' సెట్స్ పై హీరో విజయ్ ని కలిసిన ధోనీ... ఫొటోలు ఇవిగో!

12-08-2021 Thu 14:49
  • చెన్నైలో ధోనీ పర్యటన
  • హీరో విజయ్ తో మర్యాదపూర్వక భేటీ
  • చెన్నై గోకుల్ స్టూడియోస్ లో 'బీస్ట్' షూటింగ్
  • లొకేషన్ కు వచ్చిన ధోనీకి విజయ్ సాదర స్వాగతం
Dhoni met Hero Vijay at Beast sets
ఒకరు సినీ దళపతి, మరొకరు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ దళపతి... ఇద్దరూ కలిస్తే ఆ సందడే వేరు. టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ ను కలిశారు. విజయ్ ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జరుగుతోంది. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.