Andhra Pradesh: భూసర్వేలో ఎక్కడా అవినీతి ఉండకూడదు: ఏపీ సీఎం జగన్​

AP CM YS Jagan Review On Comprehensive Land Survey
  • 2023 జూన్ నాటికి పూర్తి చేయాలి
  • అవసరమైనవి తెప్పించుకోండి
  • ఇకపై నెలకోసారి సమీక్ష నిర్వహిస్తా
  • అధికారులతో సమగ్ర భూసర్వేపై సీఎం సమీక్ష
ఎక్కడా అవినీతికి తావు లేకుండా లక్ష్యాన్ని చేరుకునేలా సమగ్ర భూ సర్వే సాగాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. 2023 జూన్ నాటికి సర్వేని పూర్తి చేయాలని ఆదేశించారు. ‘శాశ్వత భూహక్కు–భూ రక్ష’పై ఇవాళ ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. సర్వే కోసం అవసరమైన సాఫ్ట్ వేర్, పరికరాలు, వనరులను వెంటనే సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. సర్వే చేసే సిబ్బందికి మెరుగైన శిక్షణను ఇవ్వాలన్నారు.

నాలుగు వారాలకోసారి భూ సర్వేపై సమీక్ష చేస్తానని, ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లోనూ దీనిపై చర్చిస్తానని జగన్ స్పష్టం చేశారు. మంత్రుల కమిటీ కూడా వారానికోసారి సర్వే పురోగతిపై సమావేశం నిర్వహించాలని సూచించారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకుని ప్రతిష్ఠాత్మకంగా సర్వేని నిర్వహించాలన్నారు.
Andhra Pradesh
YS Jagan
Land Survey

More Telugu News