Etela Rajender: హరీశ్ రావుకు సవాల్ విసిరిన ఈటల రాజేందర్

Etela Rajender challenges Harish Rao
  • నా ఆస్తులపై విచారణకు నేను సిద్ధం
  • ఆయన ఆస్తులపై విచారణకు హరీశ్ సిద్ధమా?
  • నా గురించి మాట్లాడే అర్హత కూడా హరీశ్ కు లేదు
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తన గురించి అబద్ధపు మాటలు చెప్పి హుజూరాబాద్ ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని హరీశ్ చేశారని మండిపడ్డారు. హరీశ్ వి మోసపు మాటలనే విషయం ఇక్కడి ప్రజలకు తెలుసని... ఇక్కడి ప్రజల ప్రేమను పొంది, వరుసగా గెలుస్తున్న వ్యక్తిని తానని చెప్పారు.

టీఆర్ఎస్ లో చేరడానికి ముందు తనకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అన్నారు. 2001లో హరీశ్ కు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులపై విచారణకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ విషయంపై అబిడ్స్ లో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన హరీశ్ కు తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని... దుబ్బాక ఎన్నికలో కూడా ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పిన హరీశ్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా హరీశ్ కు బుద్ధి చెపుతారని అన్నారు.
Etela Rajender
BJP
Harish Rao
TRS
Huzurabad

More Telugu News