యాంకర్ గాయత్రి ఫేస్ బుక్ హ్యాక్.. అభ్యంతరకర మెసేజ్ లు పెడుతున్న దుండగులు!

12-08-2021 Thu 11:48
  • గాయత్రి ఫేస్ బుక్, పేజ్ లను హ్యాక్ చేసిన దుండగులు
  • మతాలకు సంబంధించి అభ్యంతరకర మెసేజ్ లు పెడుతున్న వైనం
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయత్రి
Telugu anchor Gayathri facebook account hacked
ఇటీవలి కాలంలో పలువురి సోషల్  మీడియా ఖాతాలు హ్యాక్ కు గురవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ, టీవీ సెలబ్రిటీలకు ఈ బెడద మరింత ఎక్కువగా ఉంది. తాజాగా బుల్లితెర యాంకర్, సినీ నటి గాయత్రి భార్గవి ఫేస్ బుక్ ఖాతాను దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఆమె హైదరాబాద్ పోలీసులను  ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు.

ఈ అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్ స్పందిస్తూ... గాయత్రి భార్గవికి ఫేస్ బుక్ ఖాతాతో పాటు, ప్రత్యేకంగా పేజీ కూడా ఉందని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఫేస్ బుక్, పేజ్ లను హ్యాక్ చేసి... వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకరమైన మెసేజ్ లను పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.